ప్రాంతీయం

1991-92 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం…

268,901 Views

ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే28( జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1991-92 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ముస్తాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు . తమకు విద్యాబుద్ధులు చెప్పిన నాటి గురువులను పూర్వ విద్యార్థులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థులు అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వివిధ వృత్తులలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తమ గతస్మృతులన నెమరువేసుకుంటూ తాము చదువుకున్న పాఠశాలలో కలసి తిరిగి తమ అనుబంధాలను స్మరించుకున్నారు. తమ విద్య, వైవాహిక, ఉద్యోగ జీవిత విశేషాలు కుటుంబ నేపథ్యాల విషయాల గురించి ఒకరికొకరు తమపిల్లలు చదువుల గురించి వివరాలు చెప్పుకుంటూ ఎంతో ఆనందోత్సాహాలతో గడిపారు. ఈకార్యక్రమంలో చుంచుబాబు, బిట్ల దేవానందం, గందె సురేందర్, వేముల రవీందర్ గౌడ్, బాలసాని శ్రీనివాస్ గౌడ్, జనగామ శ్రీనివాస్, మల్లారపు హనుమయ్య, కుంభాల యాదగిరి రెడ్డి, తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *