ప్రాంతీయం

టీడబ్ల్యూజేఎఫ్ – హెచ్-2843 ఫెడరేషన్ నగర అధ్యక్షుడిని పరామర్శించిన జిల్లా నాయకత్వం

48 Views

టీడబ్ల్యూజేఎఫ్ – హెచ్-2843 ఫెడరేషన్ నగర అధ్యక్షుడిని పరామర్శించిన జిల్లా నాయకత్వం

నేలకొండపల్లి, జనవరి 25, తెలుగు న్యూస్ 24/7 

విధి నిర్వహణలో ప్రమాదానికి గురైన ఖమ్మం పట్టణ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్ – హెచ్ -2843) పట్టణ అధ్యక్షుడు గంటెల కుమార్‌ను టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా బృందంకలిసిపరామర్శించింది.నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామంలో నివాసానికి చేరుకునే సమయంలో రహదారి మరమ్మతుల కారణంగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో ఆయనకు ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం వెన్నుపూస భాగానికి గాయం అయినట్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా బృందం గంటెల కుమార్ నివాసానికి చేరుకుని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంది. ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సంతోష్ చక్రవర్తి, నానబాల రామకృష్ణలు మాట్లాడుతూ యూనియన్‌లోని ప్రతి సభ్యుడికి ఎలాంటి ప్రమాదం లేదా అనుకోని పరిస్థితి ఎదురైనా టీడబ్ల్యూజేఎఫ్ ప్రత్యక్షంగా, పరోక్షంగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కలం పట్టుకుని ప్రజాసేవ చేస్తున్న జర్నలిస్టుల భద్రత, సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా నాయకత్వం పేర్కొంది. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా కోశాధికారి అరవపల్లి నగేష్, టీబిజెఏ జిల్లా అధ్యక్షుడు వందనపు సామ్రాట్ గుప్తా, కండరబోయిన నాగకృష్ణ, షేక్ సొందుమియా, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *