ప్రాంతీయం

నేడే తెలంగాణ మూవీ,టీవీ,డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ జనరల్ బాడీ సమావేశనికి అందరికీ ఆహ్వానం

26 Views

నేడే తెలంగాణ మూవీ,టీవీ,డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ జనరల్ బాడీ సమావేశనికి అందరికీ ఆహ్వానం:అధ్యక్షులు రాజశేఖర్.

హైదరాబాద్,జనవరి 24 తెలుగు న్యూస్ 24/7

తెలంగాణా మూవి,టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్స్ యూనియన్ జనరల్ బాడీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని తెలంగాణా మూవి,టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్స్ యూనియన్ అధ్యక్షులు రాజశేఖర్ తెలిపారు.శనివారం తెలంగాణా మూవి,టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం(సర్వసభ్య సమావేశం) ఈ రోజు మోతినగర్ కమ్యూనిటీ హాల్లో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరుకు జరుగుతుందని ఆయన సూచించారు.ఈసమావేశానికి ముఖ్యఅతిథిగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్,రహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డిలు హాజరవుతున్నట్లు సూచించారు.అందుకు యూనియన్ కార్యవర్గ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు తమ విధిగా విచ్చేసి యూనియన్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆయన తెలిపారు.అంతేకాకుండా సమావేశంలో పలు అంశాలు చర్చిస్తామని అన్నారు.దీంతో సభ్యులందరు తప్పనిసరిగా యూనియన్ సభ్యులను ప్రతి ఒక్కరిని పేరుపేరునా ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగిందని అధ్యక్షులు రాజశేఖర్,జనరల్ సెక్రెటరీ నూకరాజులు సూచించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *