ప్రాంతీయం

పిల్లల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

22 Views

పిల్లల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా ,జనవరి 23, 2026:
ప్రభుత్వ పాఠశాలలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. యాదయ్య, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి భాగ్యవతి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మ రావ, జిల్లా మేనేజర్ శ్రీకళ, మండల విద్యాధికారులతో ప్రధానమంత్రి పోషణ్ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు పౌష్టికాహారం అందజేయాలని, వారి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. జిల్లాలోని 747 పాఠశాలలో చదువుతున్న 37 వేల 749 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం క్రింద మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించడంతో పాటు రోజు విడిచి రోజు కోడిగుడ్డు అందించడం జరుగుతుందని తెలిపారు. 1 నుండి 8వ తరగతి విద్యార్థులకు సంబంధించిన మధ్యాహ్న భోజన పథకం చెల్లింపులు డిసెంబర్ – 2025 వరకు జరిగాయని, మిగతా పెండింగ్ లో ఉన్న బిల్లులు త్వరలోనే చెల్లించడం జరుగుతుందని, పథకానికి సంబంధించిన బిల్లులు ఎప్పటికప్పుడు సమర్పించాలని తెలిపారు. జిల్లాలో దాదాపు 72 శాతం విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం కింద లబ్ధి పొందుతున్నారని, 100 శాతం విద్యార్థులకు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో 11 శాతం పాఠశాలలలో మాత్రమే కిచెన్ గార్డెన్స్ అందుబాటులో ఉన్నాయని, పాఠశాలలలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో కిచెన్ గార్డెన్స్ (స్కూల్ న్యూట్రిషన్ గార్డెన్) ఏర్పాటు చేసేలా కృషి చేయాలని తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మధ్యాహ్న భోజన పథకం సంబంధిత రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించాలని, ఆహారాన్ని వేడి వేడిగా విద్యార్థులకు అందించాలని తెలిపారు. జిల్లా విద్యాధికారి, మండల విద్యాధికారులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు తమ పరిధిలోని పాఠశాలను సందర్శిస్తూ మధ్యాహ్నం భోజన పథకం నిర్వహణపై పర్యవేక్షించాలని తెలిపారు. గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వంటశాలల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు తరచుగా వైద్య పరీక్షలు చేయాలని, ఎత్తు, బరువు, కొలతలు సేకరించి స్టూడెంట్ హెల్త్ కార్డు సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. వంట మనుషులు, సహాయకులు వంట చేసే సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, వంట చేయడానికి నాణ్యమైన సామాగ్రి, తాజా కూరగాయలను వినియోగించాలని తెలిపారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వడ్డించే ఆహారం నాణ్యత, పోషక ప్రమాణాలను పరీక్షించాలని తెలిపారు. పాఠశాలలకు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని, పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమానికి సమగ్ర శిక్ష అభియాన్ నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు. కె.జి.బి.వి.లు, ఆశ్రమ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సాధించాలని, ఉపాధ్యాయుల పనితీరును సమీక్షించాలని, ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరు అయిన ఉపాధ్యాయులకు షో కాజ్ నోటీసులు జారీచేసి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *