ప్రాంతీయం

మోడీ బిజెపి పాలనలో దేశంలో పెరిగిన నిరుద్యోగ తీవ్రత.యువత పోరాటాలకు సిద్ధం కావాలి

100 Views

మోడీ బిజెపి పాలనలో దేశంలో పెరిగిన నిరుద్యోగ తీవ్రత.యువత పోరాటాలకు సిద్ధం కావాలి

– ఏ.ఐ.వై.ఎఫ్ ఖమ్మం జిల్లా సమితి క్యాలెండర్ ముద్రించడం అభినందనీయం.

– ఏ.ఐ.వై.ఎఫ్ జాతీయ అధ్యక్షుడు రోషన్ కుమార్ సిన్హా పిలుపు.

– స్వాతంత్య్ర సమరయోధుల,మహనీయుల పోటోలతో,నిరుద్యోగుల డిమాండ్స్ తో ఏ.ఐ.వై.ఎఫ్ క్యాలెండర్ ముద్రణ.

– ఏ.ఐ.వై.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నానబాల.రామకృష్ణ వెల్లడి.

– ఏ.ఐ.వై.ఎఫ్ ఖమ్మం జిల్లా సమితి 2026 క్యాలెండర్ ఆవిష్కరణ.

ఖమ్మం,జనవరి 22, తెలుగు న్యూస్ 24/7

దేశంలో మోడీ, బిజెపి పాలనలో నిరుద్యోగ తీవ్రత రోజురోజుకు పెరుగుతోందని, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (ఏ.ఐ.వై.ఎఫ్)స్వాతంత్య్ర సమరయోధుల,మహనీయుల పోటోలతో,నిరుద్యోగుల డిమాండ్స్ తో ఖమ్మం జిల్లా సమితఏ.ఐ.వై.ఎఫ్)క్యాలెండర్ 2026 ముద్రించడం అభినందనీయం అన్ని యువత పోరాటాలకు సిద్ధం కావాలని (ఏ.ఐ.వై.ఎఫ్) జాతీయ అధ్యక్షుడు రోషన్ కుమార్ సిన్హా జిల్లా ప్రధాన కార్యదర్శి నానబాల.రామకృష్ణ పిలుపు నిచ్చారు.అఖిల భారత యువజన సమాఖ్య(ఏ.ఐ.వై.ఎఫ్) ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో ముద్రించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను స్థానిక గిరిప్రసాద్ భవన్ లో ఏ.ఐ.వై.ఎఫ్ జిల్లా కార్యాలయంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏ.ఐ.వై.ఎఫ్ జాతీయ అధ్యక్షుడు రోషన్ కుమార్ సిన్హా, జిల్లా ప్రధాన కార్యదర్శి నానబాల.రామకృష్ణ,జిల్లా నాయకత్వం సంయుక్తంగా ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా ఏ.ఐ.వై.ఎఫ్ జిల్లా నాయకులు ఆఫీస్ బేరర్ చింతల.రమేష్ అధ్యక్షతన జరిగిన ఆవిష్కరణ సభలో ముఖ్య అతిథులుగా పాల్గొని( ఏ.ఐ.వై.ఎఫ్) జాతీయ అధ్యక్షుడు రోషన్ కుమార్ సిన్హా మాట్లాడుతూ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని,దేశంలో ఒకవైపు నిరుద్యోగ తీవ్రత రోజురోజుకు,

పెరుగుతుంటె,మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం, పేరు మార్చి పూర్తిగా ఆ పథకాన్ని నిరుగార్చి తీసివేసే కుట్రలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.దేశంలో మోడీ, బిజెపి పాలనలో నిరుద్యోగ తీవ్రత రోజురోజుకు పెరుగుతోందని,ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్(ఏ.ఐ.వై.ఎఫ్)స్వాతంత్య్ర సమరయోధుల,మహనీయుల పోటోలతో,నిరుద్యోగుల డిమాండ్స్ తో ఖమ్మం జిల్లా క్యాలెండర్ 2026 ముద్రించడం అభినందనీయం అన్ని యువత పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఏ.ఐ.వై.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నానబాల.రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రoలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందుతుందని,నిరుద్యోగ భృతి ఉద్యోగ క్యాలెండర్ లను అమలు చేసి నోటిఫికేషన్స్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.స్వాతంత్య్ర సమరయోధుల,మహనీయుల పోటోలతో,నిరుద్యోగుల డిమాండ్స్ తో ఖమ్మం జిల్లా క్యాలెండర్ 2026 ముద్రించడం జరిగిందని, క్యాలెండర్ ముద్రణకు అడ్వటైస్మెంట్స్ ఇచ్చి ప్రోత్సహించిన వారందరికీ ఏ.ఐ.వై.ఎఫ్ ఖమ్మం జిల్లా సమితి తరుపున ధన్యవాదాలు,అభినందనలు,శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏ.ఐ.వై.ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్ శ్రీమాన్,ఏ.ఐ.వై.ఎఫ్ ఖమ్మంం జిల్లా సహాయ కార్యదర్శిమల్లెబోయిన.ఉపేందర్,నాయకులు చిరా.ఉపేందర్,దాసరి. బన్ను,వెంకటేష్,ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *