వారసత్వం పేరుతో మాకు అన్యాయం చేయొద్దు
యాదాద్రి భువనగిరి జిల్లా జులై 11
తుర్కపల్లి మండలం పల్లెపహాడ్ గ్రామంలో కొందరు వ్యక్తులు వారసత్వం పేరుతో తమ భూములు లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారని, తమ భూములు అన్యాయానికి గురౌతున్నాయని తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.
తాతల కాలం నుంచి భూమిని కొనుగోలు చేసుకొని సేద్యం చేస్తున్న భూమిని కొందరు అత్యాశతో భూమిని లాక్కోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తూ బుధవారంనాడు స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో కు వినతిపత్రాన్ని అందచేశారు.ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో బాధితులు మాట్లాడుతూ పల్లెపహాడ్ గ్రామంలో సర్వే నెంబర్ 324,342,344,345,346,367,363,347,548,652,299,300,301,302,లో గల 104 ఎకరాల్లోని భూమి 144 మంది రైతులకు గతంలో అదే గ్రామస్థుడైన పిన్నోజు బాలనాగయ్య రిజిస్ట్రేషన్ చేశాడు.అట్టి రైతుల రిజిస్ట్రేషన్ పత్రాలపై తన కుమారుడైనా పిన్నోజు నర్సింహ చారి (లెట్) కూడా సంతకం చేశాడు, కాగా ఇటీవల బాలనాగయ్య కోడలు పిన్నోజు విజయలక్ష్మి కోర్టును ఆశ్రయించి తన కూతుళ్లు, అనగా బాల నాగయ్య మనుమరాళ్లకు ఆ భూమి చెందుతుందని ఆరోపిస్తూ కోర్టు ద్వారా గ్రామ రైతులు 144 మంది కుటుంబాలకు నోటీసులు జారీ చేయించింది.నోటీసులు అందిన బాధిత రైతులు లబోదిబోమంటు స్థానిక తహశీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తాత ముత్తాతల నుండి అప్పో సోప్పో చేసి భూమిని కొనుగోలు చేసుకొని సాగుచేసుకుంటున్న భూమిని గతంలో మాకు భూనినమ్మిన వ్యక్తి మనుమరాళ్లు మమ్ములను మనోవేదన గురిచేస్తు భయాందోళనకు గురిచేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. మాకు న్యాయం చేయాలని అధికారులను కోరుతూ,లేని పక్షంలో అదే భూమిలో ఆత్మహత్యలకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బాధితరైతులు జూపల్లి గౌరినాథ్, దాసరి పెద్ద గురువయ్య, గురు నరసయ్య, గురు మల్లయ్య, బాల నరసింహ, జూపల్లి శ్రీనివాస్, బానోతు రాములు, చందు, రవి,దాసరి జంగులు,జూపల్లి తిరుపతయ్య,అండమ్మ, లక్ష్మయ్య,చింతకింది కనకయ్య,సొక్కుల సాయి రాంరెడ్డి, సొక్కుల మోహన్ రెడ్డి,భూక్య సంతోష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు





