మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్.
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ సూర్యనారాయణ, సేవా అధ్యక్షురాలు మాలతి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సింగరేణి ఏరియా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, అధికారులు మరియు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
