ప్రాంతీయం

గజ్వేల్ పట్టణంలోని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

64 Views

గజ్వేల్ పట్టణంలోని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి..

సిద్దిపేట జిల్లా,జనవరి 20, తెలుగు న్యూస్ 24/7 

గజ్వేల్ ఐఓసీ లో ఇందిరా మహిళ శక్తి సంబరాల్లో భాగంగా గజ్వేల్ పట్టణంలోని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి.ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, ఏఏంసి ఛైర్మన్ నరేందర్, పిడి మెప్మా హనుమంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బాలకిషన్, తహసిల్దార్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.నేను కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మహిళలందరినీ గజ్వేల్( ఐ ఓ సి )లో అనేక సార్లు కలవడం జరిగింది. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు అన్నియు మహిళా ప్రాధాన్యమే మొదటిది.

గజ్వేల్ నియోజకవర్గం వాళ్లు గా 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని జిల్లా మొత్తంలో 12500 ఇండ్లు మంజూరు జరిగిందని అందులో 90 శాతం గ్రౌండింగ్ చేశారని 80 శాతం మందికి ఆయా స్థాయిలో డబ్బులు కూడా వారి అకౌంట్లలో ప్రభుత్వం జమ చేసింది.రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ తో పాటు పాత కార్డులలో సభ్యులను చేర్చడం జరిగింది. పేద వారి నాణ్యమైన ఆహారం అందించడం కోసం రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు.జిల్లాలో రైతు భరోసా కింద 390 కోట్ల రైతుల ఖాతాలో జమ చేశారు.గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు గృహాలకు ఉచిత కరెంట్,

ఈవ్వడంజరుగుతుంది.వడ్డీలేని రుణాలు గజ్వేల్ అర్బన్ లో 1 కోటి 28 లక్షల ఆయా గ్రూపులకు అందజేయడం జరిగింది.ఇందిరమ్మ చీరలు పంపిణీ పట్టణంలో చేయడం 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరకు హర్హులే గ్రూపులో ఉన్న వాళ్ల కి మాత్రమే ఇస్తారనే అపోహ వద్దని తెలిపారు.మీ వార్డుల వాళ్లుగా అర్హత గల ప్రతి మహిళలకు అధికారులు చీరల పంపిణీ లో చేస్తారని వార్డు మహిళలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు.ప్రభుత్వం అందించే అన్ని పథకాలను స్వీకరించి మహిళలకు ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా లబ్ది పొందాలని తెలిపారు.అనంతరం అధికారులతో కలిసి మహిళలకు ఇందిరమ్మ చీరలను అందజేశారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *