ప్రాంతీయం

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రజ్ఞాపూర్ లో మధ్యాహ్న బోజన ప్రక్రియను ఆకస్మిక తనికి..

33 Views

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రజ్ఞాపూర్ లో మధ్యాహ్న బోజన ప్రక్రియను ఆకస్మిక తనికి..

జిల్లా కలెక్టర్ కె. హైమావతి..

సిద్దిపేట జిల్లా, జనవరి 20, తెలుగు న్యూస్ 24/7 

గజ్వేల్ పట్టణం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రజ్ఞాపూర్ లో మధ్యాహ్న బోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా తనికి చేశారు.వంట గదికి వెళ్ళి ఆహార పదార్థాలు బీరకాయ పప్పు, సాంబారులను పరిశీలించారు. రోజు కామన్ డైట్ మెను పాటించాలని విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని అందించాలని వంట సిబ్బందినిఆదేశించారు.విద్యార్థులతో ఆప్యాయంగా పలకరించి ఉదయం ఏం తిన్నావు, మధ్యాహ్నం భోజనం బాగుంటుందా, సెలబస్ ఎంత వరకు వచ్చింది, చదువు ఎలా సాగుతుందని విద్యార్థులను అడగ్గ ఉదయం రాగి జావా తాగమని, భోజనం మీరు పాఠశాలను పర్యవేక్షణ చేస్తున్నప్పటినుండి నుండి మెరుగైందని, సిలబస్ సగం కంటే ఎక్కువ అయిందని విద్యార్థులు తెలిపారు. ఒక ఉన్నతమైన లక్ష్యం పెట్టుకుని సమయం వృధా చేయకుండా బాగా చదవాలని తెలిపారు. పాఠశాలలోని కిచెన్ గార్డెన్ లో పరిశీలించి పలు సూచనలు చేశారు. పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలని సిబ్బంది నీ ఆదేశించారు. విద్యార్థులకు చదువు, మధ్యాహ్న భోజనం విషయంలో రాజి పడవద్దని ప్రిన్సిపల్ ఉపాధ్యాయులను ఆదేశించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *