ప్రాంతీయం

టీఎన్జీవో మంచిర్యాల జిల్లా డైరీ మరియు క్యాలెండర్ ను ఆవిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఐఏఎస్

17 Views

మంచిర్యాల జిల్లా.

టీఎన్జీవో మంచిర్యాల జిల్లా డైరీ మరియు క్యాలెండర్ ను ఆవిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఐఏఎస్. ఈ రోజు టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి  ఆధ్వర్యంలో ముఖ్యఅతిథి మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ టీఎన్జీవో మంచిర్యాల జిల్లా డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగినది.

ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ మాట్లాడుతూ టీఎన్జీవో మంచిర్యాల జిల్లా క్యాలెండర్ మరియు డైరీ చాలా బ్రహ్మాండంగా తయారు చేశారని ఇందులో పొందుపరిచిన ప్రతి అంశము ఉద్యోగులకు విధి నిర్వహణలో చాలా ఉపయోగకరంగా ఉంటుందని అదేవిధంగా మంచిర్యాల జిల్లా కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ గౌరవ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఐఏఎస్ కీ కృతజ్ఞతలు తెలుపడం జరిగినది.ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి శ్రీ భూముల రామ్మోహన్ కేంద్ర సంఘం కార్యదర్శి శ్రీ పొన్న మల్లయ్య  అసోసియేట్ అధ్యక్షులు శ్రీ శ్రీపతి బాపురావు కోశాధికారి శ్రీ సతీష్ కుమార్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రాంకుమార్ తిరుపతి అంజయ్య కేజియా రాణి, పద్మ లత,నరేందర్, శ్రీధర్ రాజు సంయుక్త కార్యదర్శిలు సునీత, ప్రభు, సురేందర్, రోశయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రావణ్ పబ్లిసిటీ సెక్రటరీ యూసుఫ్ మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ కార్యదర్శి అజయ్ ప్రశాంత్ లక్షటిపేట యూనిట్ అధ్యక్షులు గొల్ల శ్రీనివాస్ బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్ మందమర్రి యూనిట్ అధ్యక్షులు సుమన్ చెన్నూరు యూనిట్ అధ్యక్షులు అభిషేక్ కన్నెపల్లి యూనిట్ అధ్యక్షులు పద్మనాభం జిల్లా కార్యవర్గ సభ్యులు పద్మజ, రాజేందర్,కుమార్, మోసిన్, ప్రణవా నందు, సరిత తదితరులు పాల్గొన్నారు..

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *