ప్రాంతీయం

రోడ్డు భద్రత నియమాలు పాటిద్దాం – ప్రతి రోడ్డు ప్రమాదాన్ని నివారిద్దాం

10 Views

రామగుండం పోలీస్ కమిషనరేట్

రోడ్డు భద్రత నియమాలు పాటిద్దాం – ప్రతి రోడ్డు ప్రమాదాన్ని నివారిద్దాం

హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి – మీ చిన్న నిర్లక్ష్యం ప్రాణాంతకం : పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి

రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచడం ద్వారా ప్రతి ఒక్కరూ సురక్షితంగా తమ గమ్యాన్ని చేరుకుని విలువైన మానవ ప్రాణాలను కాపాడుకోవాలనే ప్రధాన లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “అరైవ్ – అలైవ్” కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజున బ్లాక్ స్పాట్ల సందర్శన మరియు ప్రజలు, వాహనదారులతో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జ  ఆదేశాల మేరకు పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్‌లతో కలిసి మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని …… ప్రాంతంలో ఉన్న బ్లాక్ స్పాట్లను సందర్శించి, ప్రజలు మరియు వాహనదారులతో మాట్లాడి ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, ప్రమాదాలను నివారించి ప్రతి ఒక్కరూ సురక్షితంగా ప్రయాణించి గమ్యాన్ని చేరుకునేలా ప్రజల్లో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన పెంపొందించడం, బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు ప్రతి సారి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్‌ను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు.

అతివేగం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరూ మద్యం సేవించి వాహనం నడపకుండా, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తూ తమ కుటుంబాలను, సమాజాన్ని సురక్షితంగా ఉంచాలని వాహనదారులను కోరారు.

ఈ కార్యక్రమంలో మంథని సీఐ రాజు, కమాన్‌పూర్ ఎస్సై రమేష్, ఎస్సై ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *