పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంచిర్యాల జడ్పి బాయ్స్ హై స్కూల్‌లో నిర్వహించిన జిల్లా యూత్ ఫెస్టివల్ మరియు సైన్స్ ఫేర్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కి ఘన స్వాగతం పలికిన విద్యార్థులు.
విద్యార్థుల ప్రతిభను అభినందించి, వారు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులు, కళా ప్రదర్శనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.
విద్యార్థులలో ఉన్న సృజనాత్మకత మరియు శాస్త్రీయ దృక్పథాన్ని ప్రశంసిస్తూ, వారు తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. యువతలో ఆవిష్కరణాత్మక ఆలోచనలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. విద్య మరియు శాస్త్రానికి ఉన్న ప్రాధాన్యతను వివరించి, విజ్ఞానంలో ముందడుగు వేయడానికి శాస్త్రీయ దృక్పథం ఎంత అవసరమో వివరించారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రటరీ రఘునాథ్ రెడ్డి తో పాటు అనేక మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
