ప్రాంతీయం

ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ కే. హైమావతి జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి ప్రజలనుండి దరఖాస్తులను స్వీకరించారు

15 Views

ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ కే. హైమావతి జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి ప్రజలనుండి దరఖాస్తులను స్వీకరించారు

సిద్దిపేట జిల్లా, జనవరి 19, తెలుగు న్యూస్ 24/7

సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ కే. హైమావతి జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి ప్రజలనుండి దరఖాస్తులను స్వీకరించారు. వాళ్లతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం అర్జిలు మొత్తం 142 వచ్చాయి.ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారినాగరాజమ్మ, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.అంతకుముందు జిల్లా కలెక్టర్ గనతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం జిల్లా అధికారులతో ప్రాథమికంగా సమీక్షించి గనతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు శాఖల వాళ్లుగా కేటాయించిన శకటాలు, స్టాళ్లు ఏర్పాటు చేయాలనీ, పాఠశాల విద్యార్థులచే సంస్కృతిక కార్యక్రమాలునిర్వహించాలని, కార్యక్రమానికి వచ్చే వాళ్లకీ ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయాలనీ సూచించారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *