సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీలోని సమ్మక్క సారలమ్మ దేవాలయం వద్ద గురువారం సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఆలయ పూజారి పిట్ల పరశరాములు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా నిర్వహించి చిన్నారులకు ఉచితంగా గాలిపటాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ సంక్రాంతి భోగి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పండుగ అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ సమ్మక్క సారలమ్మ ఆలయం వద్ద త్వరలో నిర్వహించే జాతర వేడుకల్లో అందరూ పాల్గొని అమ్మవారల కృపకు పాత్రులు కావాలని కోరుతూ కోరిన కోర్కెలు నెరవేర్చే కొంగుబంగారంగా సమ్మక్క సారలమ్మ ఆలయం విరాజిల్లుతుందని, మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ఆకారంలో ఇక్కడ కొలువైన అమ్మవార్లను దర్శించుకుని వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.





