అక్బర్‌పేట–భూంపల్లి మండలం వీర రెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన బండ మల్లన్న జాతర మహోత్సవ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, మల్లన్న స్వామి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





