ప్రాంతీయం

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిచిన మంచిర్యాల ఎమ్మెల్యే – రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు

15 Views

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిచిన మంచిర్యాల ఎమ్మెల్యే – రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు.

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మరియు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొనడం జరిగింది. మంచిర్యాల ఐబీ చౌరస్తా నుండి ఓవర్ బ్రిడ్జి, శ్రీనివాస టాకీస్, ఆర్ పి రోడ్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు బీజేపీ శ్రేణులతో కలిసి ర్యాలీ చేపట్టిన అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కార్పొరేషన్ లో ఉన్న సమస్యలు శాశ్వత డంప్ యార్డ్, లక్ష్మిటాకీస్- రాజీవ్ నగర్ రైల్వే వంతెన నిర్మాణం, గోదావరి పై వంతెన నిర్మాణం, కాలనీల్లో డ్రైనేజీ, రోడ్ల, సింగరేణి పట్టాల సమస్యలు పరిష్కారించాలని మరియు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కార్పొరేషన్ అధికారులకు రఘునాథ్  మెమోరాండం అందించడం జరిగింది.

ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ మంచిర్యాల కార్పొరేషన్ గా మారినప్పటికీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి అని పట్టణం అభివృద్ధికి నోచుకోవడం లేదని అన్నారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారని గెలిచి రెండు సంవత్సరాలు దాటిన ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, గాజుల ముఖేష్ గౌడ్, రంగ శ్రీశైలం, అమిరిశెట్టి రాజ్ కుమార్, సత్రం రమేష్, కుర్రె చక్రవర్తి, ఎనగందుల కృష్ణ మూర్తి, ఆకుల అశోక్ వర్ధన్, బియ్యాల సతీష్ రావు, పుదరి రాంచందర్, రాకేష్ రెన్వ, కొండవీటి తిరుమల, తూటి సరస్వతి, గడ్డం స్వామి రెడ్డి, బొలిశెట్టి అశ్విన్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *