చెన్నూర్ నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉంటాం,రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద.
మంచిర్యాల జిల్లా,జనవరి 15, 2026:
చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. గురువారం జిల్లాలోని చెన్నూర్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ లతో కలిసి శంకుస్థాపనలు చేశారు. రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, అతి తక్కువ కాలంలో నియోజకవర్గంలోని అంతర్గత రహదారులు, మురుగు కాలువల అభివృద్ధి చేపట్టడంతో పాటు ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన నిరుపేదలకు పథకం ఫలాలు అందించేందుకు అధికార యంత్రాంగం సమన్వయంతో చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. పేద ప్రజలను గుర్తించి రేషన్ కార్డులు అందించడం జరిగిందని, ప్రజాపంపిణీ వ్యవస్థలో చౌక ధరల దుకాణాల ద్వారా అర్హులైన రేషన్ కార్డుదారులకు ప్రతి నెల సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అమృత్ పథకంలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ద్వారా నిరంతరం శుద్ధమైన త్రాగునీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. చెన్నూర్ మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయల నగర అభివృద్ధి నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, వీటితో పాటు 25 కోట్ల రూపాయల టిఎఫ్ఐడిసి, డి ఎం ఎఫ్ టి, సి ఎస్ ఆర్ నిధుల ద్వారా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు లో 1 కోటి 47 లక్షల రూపాయలు, 14వ వార్డులో 98 లక్షల రూపాయలు, 7వ వార్డులో 1 కోటి 63 లక్షల రూపాయలు, 15వ వార్డులో 69 లక్షల రూపాయలు, 16వ వార్డులో 62 లక్షల రూపాయలు, 17వ వార్డులో 61 లక్షల రూపాయలు, 12వ వార్డులో 68 లక్షల రూపాయలు, 13వ వార్డులో 1 కోటి 40 లక్షల రూపాయలు, 5వ వార్డులో 1 కోటి 31 లక్షల రూపాయలు, 4వ వార్డులో 43 లక్షల రూపాయలు, 18వ వార్డులో 27 లక్షల రూపాయలు, 9వ వార్డులో 20 లక్షల రూపాయలు, 11వ వార్డులో 83 లక్షల రూపాయలు, 10వ వార్డులో 42 లక్షల రూపాయలు, 3వ వార్డులో 29 లక్షల రూపాయలు, 2వ వార్డులో 38 లక్షల రూపాయలు, 1వ వార్డులో 28 లక్షల రూపాయలు, 8వ వార్డులో 51 లక్షల రూపాయలతో అంతర్గత రహదారులు, మురుగు కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో గల ప్రతి ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





