ముస్తాబాద్, జనవరి 15 (24/7న్యూస్ ప్రతినిధి) చిగురు నరేష్ నూతన సర్పంచిగా బాధ్యతలు చేపట్టి అదే కోవలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా యూత్ సభ్యులు శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం ప్రస్తుత యువ నాయకులు బంధనకల్ సర్పంచ్ చిగురు నరేష్ మాట్లాడుతూ యూత్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపి మకర సంక్రాంతి శ్రీ.దేవియూత్ అసోసియేషన్స్ వారు 24 సంవత్సరాల జీవన ప్రయాణంలో మాయూత్ లో సభ్యునిగా ఉండి నేడు గ్రామ సర్పంచిగా ముస్తాబాద్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భం తెలుసుకొని యూత్ సభ్యులు అందరూ కలిసి నాతోపాటు, సుమన్ ఉప
సర్పంచ్ లకు శాలువతో చిరు సన్మానం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో శ్రీ దేవీయూత్ సభ్యులు అధ్యక్షులు భూపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు చిగురు పాండరి, చిగురు పురుషోత్తం, క్యాషియర్ తుపాకుల శ్రీనివాస్, తుమ్మ శీను, చింతల నాగరాజు, గొల్లపల్లి శీను, జెల్ల నాగరాజు, చిగురు సురేష్, పాతూరి సతీష్, బాపురెడ్డి మోట్ల వెంకటేష్ వార్డ్ మెంబర్ తుపాకుల యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




