మీరుదొడ్డి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ..
జిల్లా కలెక్టర్ కే.హైమావతి..
సిద్దిపేట జిల్లా,జనవరి 13, తెలుగు న్యూస్ 24/7
మీరుదొడ్డి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కే.హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. అటెండెన్స్ రిజిస్టర్ ఓపి రిజిస్టర్ వెరిఫై చేశారు. పిఎచ్ సి వచ్చిన పలు రోగులకు మాట్లాడారు. ఆసుపత్రిలో వైద్యం ఎలా ఉందని అడగ్గా బాగానే ఉందని మంచిగా చూస్తున్నారని కలెక్టర్ కి తెలిపారు. వృద్ధులు బలవర్ధకమైన ఆహారం రాగి జావా, మిల్లెట్స్ తీసుకోవాలని తెలిపారు. యునాని వైద్య సేవల గూర్చి ఆరా తియ్యగా వృద్ధులకు యునాని వైద్యం వైపు మళ్లించాలని యునాని సెలవులను విసృతంగా ప్రచారం చెయ్యాలని యునానీ, డాక్టర్ ను ఆదేశించారు. ఈ మధ్యకాలం లో చిన్న పిల్లలకు పలు వ్యాధుల బారిన పడితే వ్యాయామం యోగా క్రమం తప్పకుండా ధ్యానం, ప్రాణాయామం నేర్పించాలని యోగ ఉపాద్యాయులకు తెలిపారు.మీరుదొడ్డి మండలంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. తహసిల్దార్ అత్యవసర పనికై ఆర్డీఓ కార్యాలయం కి వెళ్ళారని సిబ్బంది కలెక్టర్ కి తెలిపారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేశారు. కార్యాలయ సిబ్బంది సమయ వేళలు పాటించాలని ఆదేశించారు. భూ భారతి పెండింగ్ అప్లికేషన్స్ డిస్పోజల్ ప్రక్రియ ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చెయ్యాలని ఆదేశించారు.





