యాసంగి సీజన్ లో రైతులకు యూరియా పంపిణీ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందిలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాము..
జిల్లా కలెక్టర్ కె. హైమావతి..
సిద్దిపేట జిల్లా, జనవరి13, తెలుగు న్యూస్ 24/7
యాసంగి సీజన్ లో రైతులకు యూరియా పంపిణీ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందిలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ కె. హైమావతి రైతులకు తెలిపారు.మీరుదొడ్డి మండల కేంద్రంలోని ఎస్ హకా సర్వీస్ సెంటర్ -2 లో యూరియా పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.రైతులతో మాట్లాడారు. ఎలాంటి కొరత ఇబ్బందులు లేవని యూరియా వెంటనే ఇస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా లోని అన్ని ప్రాంతాల్లో రైతులకు యాసంగి సీజన్ లో ఎక్కడ కూడా యూరియా కొరత రాకుండా పగడ్బందిగా ప్రణాళిక ప్రకారం అన్ని సెంటర్ లలో యూరియా బస్తాలను రైతులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నాం. మీ ప్రాంతాల్లోని వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంటారని మీ యొక్క పాసు బుక్ తీసుకుని వచ్చి యూరియా కార్డులను తీసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఒక ఎకరాకు 2 బస్తాల చొప్పున యూరియా పంపిణీ చెయ్యాలని వ్యవసాయ శాఖ అధికారులకు తెలిపారు. కౌలు రైతులు సైతం అధైర్య పడవద్దని రైతులు చేస్తున వ్యవసాయ క్షేత్ర పట్టేదర్ పాస్ బుక్ లేదా జిరాక్స్ తీసుకువస్తే యూరియా అందిస్తామని తెలిపారు.





