దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.
జిల్లా కలెక్టర్ కె. హైమావతి
సిద్దిపేట జిల్లా జనవరి 13, తెలుగు న్యూస్ 24/7
దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామం లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మెడికల్ ఆఫీసర్ డిప్యూటెషన్ లో వెళ్ళినట్లు సిబ్బంది తెలపగా వెంటనే డిప్యూటెషన్ రద్దు చేసి రేపు పి ఎచ్ సి వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిఎంఅండ్ఎచ్ఓ నీ ఫోన్ ద్వారా ఆదేశించారు. అటెండెన్స్, ఓపి రిజిస్టర్ వెరిఫై చేశారు. లీవ్ లెటర్ లు చెక్ చేస్తూ మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే పై అధికారి అనుమతి లేనిదే సెలవు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పిహెచ్ సి కి వచ్చిన రోగులకు ఓపికగా మెరుగని వైద్యం అందించాలని మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు.





