ఏం సీ సీ కార్మికులకు మద్దతు తెలిపిన బిఎస్పీ పార్టీ నాయకులు.
మంచిర్యాల జిల్లా.
బహుజన సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు అధ్యక్షతన ఏం సీ సీ కార్మికులకు బిఎస్పీ పార్టీ మద్దతు
ఈరోజు స్థానిక ఎసిసి ప్రాంతంలో ఏం సీ సీ కార్మికులు చేస్తున్న నిరువధిక సమ్మెలకు మద్దతుగా బిఎస్పి పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చినారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జోనల్ కన్వీనర్ కాదాసీ రవీందర్ జిల్లా అధ్యక్షులు ముల్కాల రాజేంద్రప్రసాద్ ఇంచార్జ్ దాగం శ్రీనివాస్ విచ్చేసి కాదాసీ రవీందర్ మాట్లాడుతూ ఏం సీ సీ కార్మికులకు వారు చేస్తున్న డిమాండ్లు అయినా ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షలు మరియు రెండు గుంటల భూమి ఇవ్వాలని ఎన్నో సంవత్సరాలోని కష్టపడి ఏం, సీ, సీ, కాపాడుకుంటూ వచ్చిన కార్మికులకు న్యాయం చెయ్యాలి అన్ని వారికి రావలసిన అన్ని బెనిఫిట్స్ వారికి ఇవ్వాలని లేకుంటే రానున్న రోజుల్లో తగిన చర్యలు చేపడతామని వారు డిమాండ్ చేస్తూ వారికి సంఘీభావం తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మడిపల్లి రాములు జిల్లా టౌన్ నాయకులు, చలపల్లి తిరుపతి జిల్లా టౌన్ నాయకులు, పులికోట లింగయ్య జిల్లా టౌన్ నాయకులు, రమేష్ బాబు జిల్లా టౌన్ నాయకులు పాల్గొన్నారు.





