దుబ్బాక గ్రామదేవత శ్రీశ్రీశ్రీ బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవం శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడింది. మహోత్సవం సందర్భంగా పలు పవిత్ర పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ విశిష్ట వేడుకల్లో భాగంగా గవ్యాంత పూజలు, ఆవాహిత దేవతా పూజలు, మూలమంత్ర అధివాస హోమం భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ బొడ్రాయిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హోమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజా సమయాల్లో భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై మహోత్సవాన్ని విజయవంతం చేయడం జరిగింది.





