డబల్ బెడ్ రూమ్ కు అప్లై చేసుకుంటే నా పేరు వచ్చింది కానీ ఇవ్వలేదు
గవర్నమెంట్ ఆపిసిర్లు నన్ను ఇబ్బంది పెడుతున్నారు నాకు న్యాయం కావాలి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేను మర్రి నర్సింహులు గజ్వెల్ ప్రజ్ఞాపూర్ నేను 2001 నుండి టి ఆర్ ఎస్ ఉద్యమంలో పాల్గొని మా నాన్నకు నాకు పార్టీలెందుకని లొల్లి అయితే నన్ను ఇంట్లో నుండి వెళ్లగొట్టిండు నేను దొమ్మాట నియోజకవర్గంలో ఆనాటి చెరుకు ముత్యం రెడ్డి మీద తెలంగాణ ఉద్యమంలో దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి ఆధ్వర్యంలో రామ్ సాగర్ విలేజిలో ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్న అప్పుడు మా నాన్న మాట వినకపోవడంతో నిలువ నీడ లేకుండా అయ్యింది మళ్లీ ప్రజ్ఞాపూర్ లోకిరాయి ఇంట్లోనే నివాసం ఉంటూ డబల్ బెడ్ రూమ్ కు అప్లై చేసుకుంటే మూడుసార్లు గవర్నమెంట్ ఆఫీసర్లు చేసిన సర్వేలో నా పేరు వచ్చింది కానీ కొంతమంది లీడర్లు చేసిన పనితీరు వల్ల డ్రా సిస్టంలో నా పేరు రాలేదు నాకు నా జీవితం మీద విరక్తి వచ్చింది కన్న తండ్రి చనిపోయిండు నిలువ నీడ లేదు ఈరోజు గాంధీ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన నేను చనిపోతే నా కుటుంబాన్ని ఆదుకోవాలని బి.ఆర్.ఎస్ పార్టీ అధినేతని కోరుతున్నాను నా ఊపిరి పోయేంతవరకు కెసిఆర్ సిద్ధాంతాలను నమ్మే వీరాభిమానిని జై కెసిఆర్ ఓ కార్యకర్త నాదో చిన్న విన్నప ఏ కార్యకర్త కూడా లేనోడిగా మిగలకండి డెవలప్మెంట్ అవ్వండి అని తెలియజేయడం జరిగింది
