ప్రాంతీయం

మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం

29 Views

కీ,,శే,, కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. ఆడపడుచు అండా-దండా మన ప్రేమ్ సాగర్ రావు.బతుకమ్మ పండుగకు ఇవ్వవలసిన చీరలను సంక్రాంతి పండుగ సందర్భంగా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం.

మంచిర్యాల నియోజకవర్గం.

మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని (నస్పూర్ మున్సిపాలిటీ) లోని కొత్త నాగార్జున కాలనీ ప్రాణహిత స్టేడియంలో, 1,2,8,12,13,14,15,22,23,24,25 వార్డుల్లోని ఆడపడుచులందరికీ చీరాలను పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే సతీమణి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు  కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.

ఈ సందర్భంగా సురేఖమ్మ మాట్లాడుతూ మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకి ఆరోగ్య బాగోలేక ఈ బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేయలేదని చెప్పారు.ఇప్పుడు మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  ఆరోగ్యం బాగవడంతో నా అక్క చెల్లెలకు సంక్రాంతి పండుగ సందర్భంగా చీరలను పంపిణీ చేయమని చెప్పారు.అనంతరం ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆడపడుచులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *