ప్రాంతీయం

ఉచిత పశు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

29 Views

రాయపోల్ మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ రొయ్యల సుగుణ శ్రీనివాస్ ప్రారంభించారు. డాక్టర్ సయ్యద్ ఆధ్వర్యంలో శిబిరం విజయవంతంగా కొనసాగింది. ఈ శిబిరంలో పాడి రైతులకు ఉచితంగా పశు వైద్య సేవలు అందించారు. ఇందులో భాగంగా 3 పశువులకు గర్భకోశ వ్యాధి నివారణ చికిత్సలు, 22 పశువులకు గర్భ నిర్ధారణ పరీక్షలు, 14 పశువులకు సాధారణ చికిత్సలు, 20 దూడలకు నటన నివారణ మందులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సుగుణ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత పశు వైద్య శిబిరాలు, గోపాలమిత్ర సేవలను పాడి రైతులు పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ సేవల ద్వారా పశువుల ఆరోగ్యం మెరుగుపడి రైతులకు ఆర్థికంగా లాభం చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేవివో జైస్వాల్ సింగ్, బాలకృష్ణ, నరేష్, గోపాలమిత్ర సూపర్వైజర్ భాస్కర్ గౌడ్, గోపాలమిత్ర హర్షద్‌, పాడి రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *