బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షుడిగా బొల్లి నరేష్ ఎన్నిక
మంచిర్యాల జిల్లా, రామకృష్ణాపూర్, తేది: 02-01-2026.
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షుడిగా బొల్లి నరేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాన్ని జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ కదాసి రవీందర్, జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్ర ప్రసాద్ మరియు దాగం శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని బొల్లి నరేష్ కి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బొల్లి నరేష్ మాట్లాడుతూ, బీఎస్పీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, రామకృష్ణాపూర్ పట్టణంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు మతిన్ ఖాన్, మందమర్రి మండల అధ్యక్షుడు గాజుల శంకర్ , తిరుపతి గోపి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.





