బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాత నే మిగతా ఎన్నికలు నిర్వహించాలి
మంచిర్యాల జిల్లా.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే పరిషత్ పురపాలక ఎన్నికలు నిర్వహించాలని బీసీ కులాల ఐక్యవేదికగా డిమాండ్ చేస్తున్నాం.
బీసీల్లో చైతన్యం కారణంగానే రెండు విడుదలగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 50 శాతానికి పైగా బీసీలు సర్పంచులుగా ఎన్నికయ్యారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ఎంపిటిసి, జడ్పిటిసి పురపాలక ఎన్నికలు నిర్వహించాలి ఓ పక్క మా జనాభా ఎంతో మా వాటా అంత కావాలని ఉద్యమాలు నడుస్తున్న నేపథ్యంలో మా ఆకాంక్షను మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి 42% రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధతకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం.
బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు మంచర్ల సదానందం, నాయకులు గంగారం, ప్రతాప్ పాల్గొన్నారు.





