సిద్దిపేట జిల్లా రాయపొల్ మండల పరిధిలోని మంతూర్ గ్రామంలో బందారం మల్లేశం గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల రామ గౌడ్ వారి కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనంలోనే మృతి చెందడం కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. ఆపద కాలంలో ప్రజలకు అండగా ఉంటానని ఆయన తెలిపారు.





