ప్రాంతీయం

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు

65 Views

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా,హెల్మెట్ ధారణ పై అవగాహన

సిద్దిపేట జిల్లా, జనవరి 

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారి ఎం వి ఐ.శంకర్ నారాయణ,హెల్మెట్ ధారణ పై అవగాహన పెంచేందుకు గురువారం జిల్లా రవాణా శాఖ కార్యాలయం నుంచి హెల్మెట్ ధరించి ద్వి చక్ర వాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది.హుస్నాబాద్ పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ యోగేశ్వర్ సింగ్, ఆటో డ్రైవర్లతో ర్యాలీ నిర్వహించారు.ములుగు గ్రామంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ నేహా, పాఠశాల పిల్లలతో వాకతాన్ నిర్వహించారు. ద్వి చక్ర వాహన ర్యాలీ లో భాగంగా సిద్దిపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ, మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న రహదారి ప్రమాదాల్లో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనాలవే అని, అందులో ఎక్కువగా 35 సంవత్సరాల లోపు యువతే ప్రాణాలు కోల్పోతున్నారని ఫలితంగా అటు దేశ అభివృద్ధి లో లో భాగస్వామ్యం అయ్యే యువత నష్టపోవడంతో పాటు వాళ్ల వాళ్ల కుటుంబానికి కూడా తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ద్వి చక్రవాహనదారులందరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బ్రతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సూచించారు. హుస్నాబాద్ పట్టణంలో ఆటో ర్యాలీలో భాగంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ యోగేశ్వర్ సింగ్, మాట్లాడుతూ ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని అతివేగంతో వాహనాల నడపొద్దని మద్యం సేవించి ఎట్టి పరిస్థితిలో వాహనాలు నడపవద్దని సూచించారు.వాకతాన్ లో భాగంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ నేహా, మాట్లాడుతూ రహదారి భద్రతలో యువత యొక్క భాగస్వామ్యం పెంచేందుకు రహదారి నియమనిబంధనలపై అవగాహన కల్పించేందుకు వాకతాన్ నిర్వహించామని తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *