ప్రాంతీయం

కొండపాక మండలం మర్పడగ గ్రామంలో పలు పర్యటనలు

37 Views

కొండపాక మండలం మర్పడగ గ్రామంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి పలు పర్యటనలు

సిద్దిపేట జిల్లా, జనవరి, తెలుగు న్యూస్ 24/7 

కొండపాక మండలం మర్పడగ గ్రామంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి పలు పర్యటనలు1.గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మధ్యాహ్న బోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మెను ప్రకారం కిచిడీ, కూర, గుడ్డు వండినట్లు సిబ్బంది కలెక్టర్ కి తెలిపారు. వంట గది పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు రుచికరంగా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు. భోజనం చేస్తున్న విద్యార్థులతో ఆహారం బాగుందా రుచిగా వండుతున్నారా అని ఆప్యాయంగా పలకరించారు. కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని విద్యార్థులకు క్రమశిక్షణ తో చదువు నేర్పించాలని ప్రిన్సిపల్ ఉపాధ్యాయులను ఆదేశించారు. అసంపూర్తిగా ప్రహరీ గోడ, టాయిలెట్స్ నిర్మాణం ఉన్నాయని ప్రిన్సిపల్ కలెక్టర్ దృష్టికి తేగా సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ టాయిలెట్స్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు.2.గ్రామంలోని పల్లెదవాఖనా ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. దవాఖాన మొత్తం కలియ తిరిగారు. లోపల చెత్త చెదారం లేకుండా శుభ్రం చేయించాలని పంచాయతీ సెక్రటరీని ఆదేశించారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేశారు. రిజిస్టర్ లు తనికి చేశారు. గ్రామంలోని ప్రెగ్నెన్సీ మహిళల టిబి, షుగర్ పేషంట్ లను తరుచు మానిటర్ చెయ్యాలని తెలిపారు. 3.గ్రామంలో శానిటేషన్ డ్రైవ్ ను పరిశీలించారు. మోరీలలో చెత్త చెదారం ఉండి నీటి నిల్వలు చూసి అసహనం వ్యక్తం చేశారు. నీటి నిల్వలలో దోమలు రావడం వలన అంటువ్యాధులకు కేంద్రంగా ఉంటాయని వారం లోపూ గ్రామం మొత్తం శానిటేషన్ డ్రైవ్ పూర్తి చెయ్యాలని పంచాయతీ కార్యదర్శి ను ఆదేశించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *