ప్రాంతీయం

ఘనంగా జన్మదిన వేడుకలు

34 Views

ఘనంగా పిసిసి అధికార ప్రతినిధి బండార్ శ్రీకాంత్ రావు జన్మదిన వేడుకలు

సిద్దిపేట జిల్లా, జనవరి, తెలుగు న్యూస్ 24/7 

తెలంగాణ రాష్ట్ర పిసిసి అధికార ప్రతినిధి బండార్ శ్రీకాంత్ రావు జన్మదినం సందర్భంగా జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామ మాజీ సర్పంచ్, గజ్వేల్ నియోజకవర్గం యువజన మాజీ అధ్యక్షులు కప్పర భాను ప్రకాష్ రావు ఆధ్వర్యంలో  శ్రీ కొండపోచమ్మ దేవాలయం వద్ద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.అంతకుముందు శ్రీ కొండపోచమ్మ అమ్మవారీని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు,అనంతరం దేవాలయం ప్రాంగణంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భాను ప్రకాష్ రావు మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని జీవితంలో ఇంకా ఉన్నంత పదవులు పొందాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కొండపోచమ్మ డైరెక్టర్ కోట ఆశయ, నరేష్, మాజీ సర్పంచ్ బిక్షపతి,నాచారం డైరెక్టర్ సంతోష్ పంతులు,మాజీ ఎంపిటిసి సావిత్రి నరసింహులు, సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ,వార్డు సభ్యులు రాజు,గుర్రం ఎల్లం,సీనియర్ నాయకులు కిష్టయ్య, నర్సింలు, కొండయ్య, మహేష్, యువజన నాయకులు స్వామి,రవి,వెంకట్, మనోజ్, రాజు,భాను చారి, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *