ప్రాంతీయం

హెవీ వెహికల్ డ్రైవర్స్ లకు, ఆటో డ్రైవర్లకు ఆరోగ్య, కంటి పరీక్షలు

57 Views

హెవీ వెహికల్ డ్రైవర్స్ లకు, ఆటో డ్రైవర్లకు ఆరోగ్య, కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది.

సిద్దిపేట జిల్లా,జనవరి 4, తెలుగు న్యూస్ 24/7 

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని,సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారులు డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ఆదేశానుసారం ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ 9 మంది సిబ్బంది తో సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ఉదయం తొమ్మిది గంటలనుండి మధ్యానం ఒకటి గంటల వరకు హెవీ వెహికల్ డ్రైవర్స్ లకు, ఆటో డ్రైవర్లకు ఆరోగ్య, కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో సిద్దిపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ , ఏఎంవిఐ శ్రీకాంత్ రెడ్డి,కానిస్టేబుల్,విక్టోరియా ,హోమ్గార్డ్స్ అష్రఫ్, రామేశ్వర్ వెంకటేష్ నరేష్ లు మేడికల్ ఆఫీసర్స్ డాక్టర్ మనోహర్ డాక్టర్ మానస మరియు సిబ్బంది పాల్గొన్నారు.ఇందులో భాగంగా ఎంవీఐ శంకర్ నారాయణ, మాట్లాడుతూ డ్రైవర్ లు ఆరోగ్య విషయం లో జాగ్రత్తలు పాటించాలని ధూమపానం మధ్య పానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని ,శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండటం డ్రైవింగ్ వృత్తిలో ఉన్నవారికి చాలా అవసరం అని పేర్కొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *