సావిత్రి బాయి పూలే 195 జయంతి మహిళ ఉపాధ్యాయ దినోత్సవం
సిద్దిపేట జిల్లా, జనవరి, తెలుగు న్యూస్ 24/7
సావిత్రి బాయి పూలే 195 జయంతి మహిళ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యం లో నిర్వహించిన సావిత్రి బాయి పూలే 195 జయంతి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ కె. హైమావతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ముందుగా జ్యోతి ప్రచోదన చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూల మాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమం ఉద్దేశించి జిల్లా కలెక్టర్.మాట్లాడుతూ.పూర్వకాలం గురువులు ఏమి ఆశించకుండా విద్యను బోధించేవారు. ఇక్కడికి వచ్చిన మహిళలు అందరూ అమ్మలు మీ పిల్లలు చదువుకుంటే ఎంత గోపవారు కావాలని ఆశీర్వదిస్తారో మీ పాఠశాలలలో కూడా మీ దగ్గర విద్యను అభ్యసించే ప్రతి ఒక్క విద్యార్థి గొప్పవారు అయ్యేలా విద్యను బోధించాలని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయి చేరుకునేలా కృషి చెయ్యాలని తెలిపారు. మీరు బోధించే ప్రతి వ్యాక్యం విద్యార్థిని ఆలోచింపజేసేలా ఉండాలని తెలిపారు. మీ దగ్గర చదివిన పిల్లలు గొప్పవాళ్ళు అయితే ఆ సంతోషం ఎంతో సంతృప్తి కలుగుతుంది.సావిత్రి బాయి పూలే మహిళలకు ఉన్నత విద్యావంతులు కావాలని ఆనాటి మహిళలకు గల కట్టు బాట్లను ఛేదించి మహిళలు చదువుకుంటూనే వృద్ధిలోకి వస్తారని అనేక ఉద్యమాలు చేసి మహిళా విద్యకు ఎంతగానో కృషి చేశారు.వసుదైక కుటుంబం అనే భావన అనేది చాలా గొప్పది. మనం మన దగ్గర చదివే పిల్లలను ఒక కుటుంబ సభ్యుల వలె చూసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే నిరుపేద విద్యార్థులకు చిత్త శుద్ధితో కి చదువు, మెను ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టాలని మీకు పిల్లలకు మీకు ఎంతగానో ఆనందం కలుగుతుందని తెలిపారు.రాయడం, చదవడం అనేది మొదటి తరగతి నుండే కి ఏకాగ్రతగా ఆటల మరియు పాటల రూపంలో పిల్లలకు బోధించాలి. పిల్లలతో ఆప్యాయంగా ఉపాధ్యాయులు మెలిగితే చెప్పిందే వేదంలా ఇష్టం నేర్చుకుంటారని మీరు చెప్పే చదువు పిల్లలకు చదువు ఇష్టం కలిగేలా బోధన ఉండాలని తెలిపారు.పిల్లల పట్ల శ్రద్ధాగా చదివించి మానసిక స్థైర్యాన్ని కలిగించి ఒక ధైర్యాన్ని నింపాలి. విద్యార్థులతో రోజు ఒక 15 నిముషాల శ్వాస మీద ధ్యాస సంబంధించినవి వ్యాయామాలు చేయించాలని నిత్యజీవితంలో ఎంతగానో ఉపయోగ పడుతుందని తెలిపారు.అనంతరం పలువురు ఉత్తమ సేవలు అందించిన మహిళా ఏంఈఓలు ఉపాధ్యాయులను,సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓ లు, మహిళా ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.





