ప్రాంతీయం

27 Views

*హజ్రత్ అలీ జన్మదిన సందర్బంగా రక్త దాన శిబిరం.*

మంచిర్యాల జిల్లా, నస్పూర్.

హజ్రత్ అలీ జన్మదిన శుభ సందర్బంగా ఖాన్‌ఖా–ఏ–పంజతన్ గుల్షన్–ఏ–వార్సీ చమన్, సీసీసీ నస్పూర్‌లో మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించబడింది.

ఈ శిబిరాన్ని ,సూఫీ ఇస్లామిక్ బోర్డు స్టేట్ ప్రెసిడెంట్ షేక్ మాషుక్ అలీ షా వార్శి సహకారంతో రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ మరియు ఫౌండర్ అబ్దుల్ రహీమ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

ఈ సందర్భంగా (తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు – సూఫీ ఇస్లామిక్ బోర్డు షేక్ మాషుక్ అలీ షా వార్శి) ముఖ్య అతిథిగా పాల్గొని, రక్తదానం మానవత్వానికి ప్రతీక అని, ప్రతి ఆరోగ్యవంతుడు ప్రతి వ్యక్తి తప్పనిసరిగా రక్తదానం చేయాలని ప్రోత్సహించారు.అలాగే ప్రముఖ టాప్ కవ్వాలి కళాకారుడు షబ్బు షాదాబ్ సబ్రీ పాల్గొని, సేవా కార్యక్రమాల్లో సీసీసీ నస్పూర్ యువత మరియు వేరే ప్రాంతం నుండి వచ్చిన భక్తులు చురుకుగా పాల్గొనాలని రక్తదానం చేసినారు. అలాగే అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని ఆయన పేర్కొన్నారు.ఈ మెగా రక్త దాన శిబిరంలో రక్తదాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం విశేషం. సేకరించిన రక్తాన్ని అత్యవసర వైద్య అవసరాల కోసం, ముఖ్యంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భిణీ స్త్రీలకు మరియు తలసేమియా సికిల్ సెల్, వ్యాధి గ్రస్తులకు మరియు చిన్నారుల చికిత్సకు వినియోగిస్తామని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా అబ్దుల్ రహీమ్ మాట్లాడుతూ, “రక్తదానం కేవలం సేవ కాదు, అది ఒక బాధ్యత. సమాజంలోని ప్రతి వ్యక్తి ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామి కావాలి” అని అన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి రక్తదాతలకు, వాలంటీర్లకు, నిర్వాహకులకు, రెడ్ క్రాస్ సొసైటీ వారికి, టెక్నీషియన్లకు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు
(తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు – సూఫీ ఇస్లామిక్ బోర్డు షేక్ మాషుక్ అలీ షా వార్శి) మరియు బ్లడ్ ఆర్గనైజషర్ అబ్దుల్ రహీమ్
హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *