సెప్టెంబర్ 30 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్:
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ , పెద్దపల్లి ఎంపీ బోర్ల కుంట వెంకటేష్ నేత , మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ,కలెక్టర్ బదవత్ సంతోష్ తో జిల్లా జరలిస్టులు సమావేశం కావడం జరిగింది
దీనిలో భాగాంగ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ ఎన్నికల సమయం కాబట్టి ఎవరో ఎవరో హామీలు ఇస్తారని , పుల్లలు సైతం పెట్టేందుకు చూస్తారని అపోహలు నమ్మవద్దని తెలిపారు. ప్రతి ఒక్క జర్నలిస్ట్ కు ఇండ్ల స్థలాలు ప్రభుత్వం నుండి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పెద్దల దృష్టి కి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు.
మంచిర్యాల జిల్లా కేంద్రo లో ప్రెస్ కోటి రూపాయలతో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే చెన్నూర్ నియోజకవర్గo లో సైతం రూ. 40 లక్షల తో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే బెల్లంపల్లి సైతం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి మంజురు చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు , సంఘం నాయకులు పాల్గొన్నారు.
