ప్రాంతీయం

మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి

33 Views

 

 

మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి

సిద్దిపేట జిల్లా, జనవరి 3, ( తెలుగు న్యూస్ 24/7 )

మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను శనివారం అందె గ్రామభివృద్ధి డెవలప్ మెంట్ ట్రస్ట్, సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో అందె గ్రామ సచివాలయం వద్ద సావిత్రి భాయ్ పూలె చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా జయంతి వేడుకలు జరిపారు. ఈ సందర్బంగా సర్పంచ్ కడారి యాదగిరి మాట్లాడుతూ, సావిత్రి బాయ్ పూలె కన్నా కళలను సాకరం అయ్యే విధముగా ప్రతి ఇంట్లో బాలికలను చదివే విదంగా కృషి చేస్తామని, మహిళా సాధికారాతకు కోసం పని చేద్దామని అన్నారు. అనంతరం అందె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో ఉపాధ్యాయులు సావిత్రి భాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి  జీవిత విశేషాలను, సేవలను గుర్తు చేసుకుంటూ విద్యార్థులతో చర్చించడం జరిగింది జరిగింది.ఇందులో భాగంగా పాఠశాల మహిళా ఉపాధ్యాయురాలు ఎం.సురేఖ ని పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు సన్మానించడమైనది. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ మాట్లాడు పర్శరాములు, రాజేందర్, సంతోష్, వరాల రాజకుమార్, అఖిల్, ఉపాధ్యాయ బృందం కృష్ణ, జాషువా, రాజేశ్వర్ చంద్ర మౌళి తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *