ప్రాంతీయం

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌ను సందర్శించిన రాజన్న జోన్-3 డీఐజీ  సున్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్..

34 Views

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌ను సందర్శించిన రాజన్న జోన్-3 డీఐజీ  సున్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్

సిద్దిపేట్ జులై 14, తెలుగు న్యూస్ 24/7

రాజన్న జోన్-3 డీఐజీ శ్రీ సున్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్, మంగళవారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనరేట్‌కు చేరుకున్న డీఐజీ కి సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం డీఐజీ  పోలీసుల నుంచి  వందనం (గార్డ్ ఆఫ్ హానర్) స్వీకరించారు. కార్యాలయ ఆవరణలో డీఐజీ  ఒక మొక్కను నాటారు. అనంతరం సి.ఎ.ఆర్ ప్రధాన కార్యాలయాన్ని, సీపీ కార్యాలయాన్ని సందర్శించారు. శాంతిభద్రతలు, నేరాలపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం, అనంతరం కమిషనరేట్ కార్యాలయంలో ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలతో డీఐజీ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ రష్మి పెరుమాళ్, జిల్లాలోని శాంతిభద్రతల పరిరక్షణ, కమిషనరేట్ పరిధిలో తీసుకుంటున్న ప్రత్యేక చొరవలు, వినూత్న కార్యక్రమాలపై డీఐజీ కి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ సమావేశంలో డీఐజీ గారు అధికారులకు పలు కీలక ఆదేశాలు, సూచనలు చేశారు:సీసీటీఎన్ఎస్ అప్‌గ్రేడేషన్, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, నేరాల సమీక్ష వేగవంతం చేయాలని సూచించారు. ఎన్.డి.పి.ఎస్ కేసులపై ప్రత్యేక నిఘా ఉంచాలని , గంజాయి, ఇతర మాదకద్రవ్యాల దుర్వినియోగంపై ప్రజల్లో, యువతలో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలి. సైబర్ నేరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ, ప్రజలను అప్రమత్తం చేయాలనీ, షీ టీమ్స్ పనితీరుపై మహిళలకు, విద్యార్థినులకు మరింత అవగాహన కల్పించాలనీ సూచించారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచేలా విజిబుల్ పోలీసింగ్‌ను నిరంతరం కొనసాగించాలి. అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు తమ పరిధిలో క్రమం తప్పకుండా వాహన తనిఖీలు చేపట్టాలనీ అదేశించారు. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో విజయవంతంగా నడుస్తున్న ‘మన పోలీస్ మన ఊరు’, ‘సిద్దిపేట సురక్ష నేత్ర’ కార్యక్రమాలను డీఐజీ  ప్రత్యేకంగా అభినందించారు. ఈ స్ఫూర్తితోనే కమిషనరేట్ పరిధిలోని అన్ని గ్రామాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ ఆవరణను ఎల్లప్పుడూ శుభ్రంగా, పచ్చదనంతో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు.అనంతరం సిద్దిపేట్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ని సందర్శించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, పెట్రోలింగ్‌ను మరింత బలోపేతం చేయడం ద్వారా నేరాలను అరికట్టవచ్చని త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ బాబుకు దిశా నిర్దేశం చేశారు.అనంతరం పోలీస్ కన్వెన్షన్ సెంటర్ ని సందర్శించారు.ఈ సందర్శన మరియు సమీక్షా సమావేశంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కుశాల్కర్, అడిషనల్ డీసీపీ (ఏఆర్) సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, సబ్-ఇన్‌స్పెక్టర్లు (ఎస్‌ఐలు) తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *