ప్రాంతీయం

సావిత్రి బాయి ఫూలే జయంతి” ఉత్సవాలు

38 Views

 

 

ఎంపీపీఎస్ శభాష్ గూడెం లో చదువుల తల్లి,భారత దేశ మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే జయంతి” ఉత్సవాలు

సిద్దిపేట జిల్లా, జనవరి 3, ( తెలుగు న్యూస్ 24/7 )

పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్ మరాఠీ మాట్లాడుతూ వేలాది సంవత్సరాలుగా భారత సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు విద్య నిరాకరించబడిన రోజుల్లో,అలాగే ఉన్నత వర్గాలతో సహా మహిళా లోకం అంతటికీ విద్య నిరాకరించబడిన కాలంలో మహిళా విద్య ఆవశ్యకతను గుర్తించిన మహనీయులు “మహాత్మా జ్యోతిరావు ఫూలే”.ఆనాడు ఉన్న కట్టుబాట్లను తెంపుకుని స్వతహాగా నిరక్ష్యరాస్యురాలు అయిన తన శ్రీమతి సావిత్రి బాయి ఫూలే కి ఇంట్లోనే చదువు చెప్పి… తనతో పూణే పట్టణంలోని మొదటి పాఠశాలను 1848 లోనే స్థాపించారు. మహిళకు విద్య నేర్పడం ఏంటని ఆ కుటుంబంపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు, దాడులు చేశారు, ఎన్నో అవమానాలకు గురి చేశారు. సావిత్రి బాయి ఫూలే పాఠశాలకు వెళ్లే సమయంలో పేడతో కొట్టినా కూడా తమ ప్రయత్నాన్ని ఆపలేరు.ఆనాడు ఆ మహనీయ దంపతులు సమాజంలో మార్పు కోసం తమ జీవితాలను ఫణంగా పెట్టి పోరాడిన ఫలితంగానే నేడు భారత సమాజంలోని మహిళా లోకం అన్ని రంగాల్లోనూ విద్య ఉద్యోలలో ఈరోజు ఈ స్థితిలో ఉన్నారనీ గుర్తు చేశారు, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పత్తిపాక మోహన్ బాబు, సోమరపు రేణుక,బండికింది స్వప్న మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *