సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో మండల వనరుల కేంద్రంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2026 సంవత్సర క్యాలెండర్‌ను మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయపోల్ మండలాన్ని విద్యారంగంలో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయ సంఘాల సహకారం ఎంతో అవసరమని, ముఖ్యంగా టిపిటిఎఫ్ సంస్థ నుండి పూర్తి సహకారం అందించాలని కోరారు. టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల హక్కుల సాధన, సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఎల్లప్పుడూ ముందువరుసలో నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కనకయ్య, జిల్లా కౌన్సిలర్లు రాములు, నర్సింలు గౌడ్, కర్ణాకర్, ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎం హన్మాంత రెడ్డి, నాయకులు మెట్టు చరణ్, సంజీవ్, సుగుణాకర్ రెడ్డి, వరప్రసాద్, నాగస్వామి, తిరుపతి, కమలాకర్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.





