ప్రాంతీయం

నమ్మకం మరింత పెరిగేలా ప్రజలకు సేవ చేయాలి

30 Views

రెవెన్యూ డిపార్ట్మెంట్ పై , నమ్మకం మరింత పెరిగేలా ప్రజలకు సేవ చేయాలి

జిల్లా కలెక్టర్ కె హైమావతి రెవెన్యూ అధికారులకు సూచన

సిద్దిపేట జిల్లా, జనవరి 2, ( తెలుగు న్యూస్ 24/7 )

రెవెన్యూ డిపార్ట్మెంట్ పై , నమ్మకం మరింత పెరిగేలా ప్రజలకు సేవ చేయాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి రెవెన్యూ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం ట్రేసా ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేచేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ట్రేసా క్యాలెండర్ ను ఆవిష్కరించి రెవెన్యూ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి సేవా అవసరమైన ముందు సంప్రదించేది రెవెన్యూ అధికారులనేనని, మీపై నమ్మకంతో మీ వద్దకు వచ్చే ప్రజలకు పరదర్శకంగా సేవలందించి రెవెన్యూ డిపార్ట్మెంట్ కు మరింత మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సమాధానంగా అందించడంలో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, కలెక్టరేట్ ఏవో రాజ్ కుమార్, ట్రేసా నాయకులు అబ్దుల్ రహమాన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *