ప్రాంతీయం

ఓపెన్ జిమ్ ఏర్పాటు కోసం భూమి పూజ

13 Views

ఓపెన్ జిమ్ ఏర్పాటు కోసం భూమి పూజ..

సిద్దిపేట జిల్లా, జనవరి 2, ( తెలుగు న్యూస్ 24/7 )

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అందె గ్రామంలో నూతనంగా ఏర్పాటు కానున్న ఓపెన్ జిమ్ ఏర్పాటు పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కడారి యాదగిరి ఆధ్వర్యంలో, ప్రజాప్రతినిధులు – గ్రామ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ,
గ్రామ యువతకు, విద్యార్థులకు
ఆరోగ్య పరిరక్షణ & ఫిట్‌నెస్ అభివృద్ధి లక్ష్యంగా ఈ ఓపెన్ జిమ్ ఏర్పాటైందని తెలిపారు.గ్రామ అభివృద్ధి దిశగా
ప్రజలకు ఉపయోగపడే సౌకర్యాలే మా లక్ష్యం అని సర్పంచ్ యాదగిరి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పాలక వర్గం, ఉపసర్పంచ్ పర్శరాములు, రాజేందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు, రవీందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, సత్యం, రాజకుమార్, ప్రవీణ్, కూమర్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *