నూతన సంవత్సరాన్ని సురక్షితంగా స్వాగతించాలి: గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి
నూతన సంవత్సరం సందర్భంగా గోదావరిఖని పోలీస్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాలు, పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి ఉత్తర్వుల ప్రకారం గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ పర్యవేక్షణలో గోదావరిఖని వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రవీందర్ ల ఆధ్వర్యంలో నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో ప్రజల ప్రాణ భద్రత, రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకొని గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 5 ఇంక్లైన్,రమేష్ నగర్, తిలక్ నగర్, గాంధీ చౌక్, అడ్డగుంటపల్లి, మార్కండేయ కాలనీ తదితర ప్రాంతాలలో ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి స్పష్టం చేశారు. నూతన సంవత్సరాన్ని సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవడం కోసం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని, అందువల్ల ప్రజలు తమ కుటుంబాల భద్రతను దృష్టిలో ఉంచుకొని డ్రంక్ అండ్ డ్రైవ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. పోలీసు శాఖ చేపడుతున్న ఈ చర్యలకు ప్రజలు సహకరించి, నూతన సంవత్సరాన్ని సురక్షితంగా స్వాగతించాలని కోరారు.





