డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు – నిందితుడికి 5 రోజుల జైలు శిక్ష
సిద్దిపేట టూ టౌన్ ఇన్స్పెక్టర్,ఉపేందర్
సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 31, ( తెలుగు న్యూస్ 24/7 )
సిద్దిపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తిని బుధవారం కోర్టులో హాజరుపరుచగా , కోర్టు తీర్పు వెల్లడించింది.నిందితుడికి జైలు శిక్ష:వడ్లూరి బాబు అనే వ్యక్తి గతంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డారు. అప్పట్లో కోర్టు విధించిన చలానాను చెల్లించకపోవడమే కాకుండా, మళ్ళీ రెండోసారి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం అతనికి 5 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.ఈ సందర్భంగా సిద్దిపేట టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, చలానాలు సకాలంలో చెల్లించాలని సూచించారు.





