మంచిర్యాల జిల్లా.
నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ యువజన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ చక్రపాణి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత స్వామి వివేకానంద మార్గంలో నడవాలని సూచించారు. యువత అన్ని రంగాల్లో రాణించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ నరేందర్ రెడ్డి, ప్రోగ్రామ్ ఆఫీసర్లు కుమారస్వామి, రాజయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.





