లైబ్రరీ ని మండల విద్యాధికారి వెంకట్రాములు చేతుల మీదుగా గ్రామ నూతన పాలక వర్గం సమక్షంలో ప్రారంభించారు
సిద్దిపేట జిల్లా ,డిసెంబర్ 29,( తెలుగు న్యూస్ 24/7 )
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పాములపర్తి రూమ్ టు రీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైబ్రరీ ని మండల విద్యాధికారి వెంకట్రాములు చేతుల మీదుగా గ్రామ నూతన పాలక వర్గం సమక్షంలో ప్రారంభించారు. లైబ్రరీ లో పిల్లల స్థాయికి అనుగుణంగా ఆరు వందల పుస్తకాలు అందించడం జరిగినది. నాలుగు స్టడీ టేబులు , నాలుగు దరి చాపలు , నాలుగు బీరువాలు , తరగతి రిజిస్టరులు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహులు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశం,పాములపర్తి పిజిహెచ్ఎం లతీఫ్ సైదా రూమ్ టు రీడ్ కో ఆర్డినేటర్ పల్లె వెంకన్న ,నూతన సర్పంచ్ భవాని, బాలకిషన్ ,,ఉపసర్పంచ్ సుధాకర్ ,వార్డు సభ్యులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మండల విద్యాధికారి వెంకట్రాములు,మాట్లాడుతూ లైబ్రరీ ఆవశ్యకతను గురించి తెలియజేస్తూ లైబ్రరీలో పిల్ల స్థాయికి అనుగుణంగా కథల పుస్తకాలు అందుబాటులోఉన్నవి వాటిని చదివిస్తూ ప్రతి పిల్లవాడికి రీడింగ్ స్కిల్స్ డెవలప్ చేయాలి అని, ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు హేమలత, ముప్పై వేల రూపాయలు పుస్తకాలు పాఠశాల కు వితరణ గావించి ఆదర్శము గా నిలిచారని వివరించారు, సర్పంచ్ భవాని, బాలకిషన్ పాఠశాల అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొనుటకు హామీ ఇచ్చారు.





