పరిశ్రమల్లో కార్మికులకు ఇన్స్యూరెన్స్ చేయించాలనీ అధికారులను ఆదేశించారు.
డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ మీటింగ్ జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధ్యక్షతన
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్ లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ మీటింగ్ జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధ్యక్షతన జరిగింది.
సిద్దిపేట జిల్లా,డిసెంబర్ 29,( తెలుగు న్యూస్ 24/7 )
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.జిల్లాలో యువత కి ఉద్యోగ ఉపాధి అందించడం కోసం పరిశ్రమలు స్థాపన ముఖ్యమైనదని. టీజీ – ఐ పాస్ లో వివిధ పరిశ్రమలు నెలకొల్పడానికి దరఖాస్తు పెట్టుకున్న అన్ని ఆయా డిపార్ట్మెంట్ వారిగా వెరిఫై చెయ్యాలని ఒకవేళ యూనిట్ నెలకొల్పడానికి సుముఖంగా లేనియెడల డిలీట్ చెయ్యాలని తెలిపారు. అలాగే అన్ని పరిశ్రమల్లో కార్మికులకు ఇన్స్యూరెన్స్ చేయించాలనీ అధికారులను ఆదేశించారు. ఇండస్ట్రియల్ లో ప్రతి డిపార్ట్మెంట్ వారిగా అన్ని శాఖల అధికారులు తనిఖీలు చెయ్యాలని ఆదేశించారు. ఎక్కువ మంది కూలీలు పని చేసే పరిశ్రమల్లో సేఫ్టీ మెథడ్స్ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఈ కమిటీలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి గణేష్ రామ్, ఎల్డిఎం హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.





