తలకొక్కుల చంద్రకళ లక్ష్మణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ
గజ్వేల్, డిసెంబర్ 22, (తెలుగు న్యూస్ 24/7 )
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సోమవారం తలకొక్కుల చంద్రకళ లక్ష్మణ్ చారిటబుల్ ట్రస్టు భవన్ లో తలకోక్కుల చంద్రకళ 10 వ వర్ధంతి సందర్భంగా ట్రస్ట్ భవన్ లో దాదాపు 120 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ తలకొక్కుల లక్ష్మణ్, కోశాధికారి దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి మధు సూధన్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంగా ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని రాబోయే రోజులలో ట్రస్టు ద్వారా విన్నూత సేవ కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ తలకొక్కుల లక్ష్మణ్, దేవులపల్లి రాజారామ్ ఆడెపు బాలచంద్రం కృష్ణమూర్తి తుమ్మ నర్సింలు శ్రీనివాస్ దూడం శ్రీరాములు సూరం లింగం స్వర్గం చంద్రం హనుమాన్ దాస్ పాశికంటి శ్రీనివాస్ గాడిపల్లి జయ విజయ్ మాదాసు జగదీశ్వర్ చెప్యాల మల్లేశం కోశాధికారి టీ.దుర్గా ప్రసాద్,ప్రధాన కార్యదర్శి టీ.మధుసూదన్ సభ్యులు ఆడెపు వెంకటలక్ష్మి భాగ్యలక్ష్మి ,స్వరూప, శ్రీలత, సరోజినీ దేవి, శోభారాణి, మణికాంత్, డాక్టర్ కృష్ణకాంత్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.





