*సెస్ ఎలక్షన్లో మాకు అవకాశం ఇస్తే అవినీతి పాలనను అంతం చేస్తాం.
*సెస్ పాలనపై తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్లబాల్ రెడ్డి.
ముస్తాబాద్ డిసెంబర్ 7: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి సెస్ లో జరిగే అవినీతిని ఆరోపణలు బయటపెడతామని ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యకర్తల మనోభావాలను తెలుసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెస్ లో జరిగే అవినీతి అరాచకాలను అంతం చేస్తామని, స్థానిక సెస్ వినియోగదారులు ఎలాంటి సమస్యలకైనా ముందుండి వారి సమస్యలను పరిష్కరించే దిశగా న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు.ఈకార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బుర్ర రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, ఎంపిటి శ్రీనివాస్, గజ్జల రాజు, ఓరగంటి తిరుపతి, ఆరుట్ల మహేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




