ప్రాంతీయం

చలో జగిత్యాల సీఎం కేసీఆర్ బహిరంగ సభకు భారీగా తరలివెళ్లిన టిఆర్ఎస్ నేతలు*

116 Views

*చలో జగిత్యాల సీఎం కేసీఆర్ బహిరంగ సభకు భారీగా తరలివెళ్లిన టిఆర్ఎస్ నేతలు*

ముస్తాబాద్ డిసెంబర్ 7 ముస్తాబాద్ మండలం నుండి జగిత్యాలలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు తరలి వెళ్లారు. అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సందర్భంగా ముస్తాబాద్ మండలం నుండి బహిరంగ సభకు 5 వేల జనాభాకు పైచిలుకు సభకు బస్సులలో తరలి వెళ్లారు. ఈసందర్భంగా రైతుబంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ దిశగా అభివృద్ధి పనులు చేసుకుంటూ అనేక సంక్షేమ పథకాలు చేపడుతూ ఏ రాష్ట్రంలో లేని పథకాలు మన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో దేశంలో ముందు వరుసలో ఉంచడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఈకార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు, సర్పంచ్ గాండ్ల సుమతి, ఏఎంసీ చైర్మన్ శీలం జానాబాయి, మెరుగు రాజేశంగౌడ్, పట్టణ అధ్యక్షుడు నరసింహారెడ్డి, టిఆర్ఎస్ మహిళా అధ్యక్షులు దబ్బెడ రేణుక, మహిళా కార్యకర్తలు, తెరాస ప్రజా ప్రతినిధులు, ఆయా గ్రామ సర్పంచులు ఎంపిటిసిలు డైరెక్టర్లు తెరాస నాయకులు కార్యకర్త అతిపెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7